మళ్లీ వెయ్యి రూపాయల నోట్లు ముద్రిస్తారా..? ఆర్బీఐ ఏం అంటుంది..?

-

వస్తువులకు, మనిషికి ఈరోజు ఉన్న వాల్యూ రేపు ఉండదు అంటారు. నీకు ఆ వస్తువు ఈరోజు చాలా ముఖ్యం, వాల్యుబుల్‌ అయి ఉండొచ్చు. ఒకరోజు నువ్వే దాన్ని లైట్‌ తీసుకుంటాం. అవసరం లేదని పక్కన పడేస్తాం. మనుషులు కూడా అంతే.! కానీ మనీకి మాత్రం ఎప్పటికీ ఆ విలువ ఉంటుంది. కరెన్సీ నోటు మాసినా, మచ్చబడినా దాని వాల్యూ మాత్రం తగ్గదు అనుకునేవాళ్లం. మోదీ గవర్నమెంట్‌ వచ్చాక..డబ్బులకు ఈరోజు ఏం జరుగుతుందో తెలియకుండా పోయింది. అప్పటివరకూ ఒక పింక్‌నోటు విలువ రెండువేలు.. కానీ ఈ మధ్యనే అది బ్యాన్‌ చేశారు. ఇప్పుడు అది ఒకరకంగా చిత్తుకాగితంతో సమానం అయిపోయింది. మొదట్లో వెయ్యినోట్లు రద్దు చేసినప్పుడు కూడా అంతే. అయితే.. రెండు వేల నోట్లు తీసేశారు కదా.. మళ్లీ వెయ్యినోట్లు చలమాణిలోకి వస్తాయి అనే వార్త ఇప్పుడు తెగ వైరల్‌ అవుతుంది. నిజంగానే మళ్లీ వెయ్యినోట్లు వస్తాయా..? దీనిపై ఆర్బీఐ ఏం అంటుంది.

ప్రభుత్వం రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్న తర్వాత రూ.1000 నోట్లపై పుకార్లు వస్తున్నాయి. ఏడేళ్ల క్రితం నిషేధించిన రూ.1000 నోట్లను మళ్లీ ముద్రించి చెలామణిలోకి తీసుకురావచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే రూ.1000 డినామినేషన్ నోట్లను వెనక్కి తీసుకురాబోమని ఆర్బీఐ ప్రకటించింది.

రూ.1,000 నోట్లను వెనక్కి తీసుకొచ్చే ఉద్దేశం ఆర్‌బీఐకి లేదని దాని మూలాన్ని ఉటంకిస్తూ ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది. దీనిపై ట్వీట్ కూడా చేసింది. ఆగస్టు నెలలో జరిగిన ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశంలో రూ.1,000 నోట్ల అంశాన్ని లేవనెత్తిన ఆర్బీఐ, ఆ నోట్లను మళ్లీ ముద్రించేది లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.500 నోట్లు ప్రస్తుత నగదు అవసరాలకు సరిపోతాయి. యూపీఐ వంటి డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరగడంతో ప్రజలకు నగదు అవసరం కూడా తగ్గింది. తద్వారా రూ.1000 నోట్ల అవసరం లేదని ఆర్బీఐ అభిప్రాయపడింది.

నవంబర్ 8, 2016న అప్పటి రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు. దేశంలోని నగదులో ఎక్కువ భాగం ఆ రెండు నోట్ల నుంచే. చాలా రోజులుగా నగదు అందక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం కొత్త రూ.500, రూ.2000 నోట్లను ముద్రించి దశలవారీగా మార్కెట్‌లోకి విడుదల చేసింది.

ఇప్పుడు రూ.2000 నోట్లను చలామణి నుంచి ఆర్బీఐ ఉపసంహరించుకుంది. అక్టోబర్ 7 వరకు అన్ని బ్యాంకుల్లో ఈ నోట్ల మార్పిడికి అనుమతినిచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్‌బీఐ కార్యాలయాల్లో మాత్రమే రూ.2,000 నోట్లను మార్చుకోవచ్చు. ఇప్పటి వరకు రూ.2000 నోట్లు చాలా వరకు ఆర్బీఐకి తిరిగి వచ్చాయి. 10,000 కోట్ల విలువైన నోట్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news