తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఇవాళ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రైతుల గురించి మాట్లాడారు. రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులు కేసీఆర్ వైపు ఉన్నారు. ఎన్నికల్లో చెప్పకపోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధును అమలు చేస్తుందన్నారు మంత్రి హరీశ్ రావు. ఓట్ల కోసం రైతు బంధును తేలేదు. రైతు బంధును నిలిపివేయాలని కాంగ్రెస్ ఈసీని ఎలా కోరుతుందని ప్రశ్నించారు.
కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి 5 గంటలు ఇస్తామని చెప్పాడు.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు 3 చాలు అంటున్నాడు. రేపు ఆసరా ఫించన్లతో పాటు ఇతర స్కీమ్ లను ఆపాలని కాంగ్రెస్ కోరుతుందేమోనని హరీశ్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నప్పుడు కరెంట్, నీటి సమస్యలు ఉండేవి. కరెంట్ లేక బావుల వద్ద నిద్రిస్తున్న రైతులకు పాము కాటు వల్ల ఎంతో మంది మరణించారని పేర్కొన్నారు. రైతులు కేసీఆర్ కు ఓటు వేస్తారని కాంగ్రెస్ భయపడుతుందన్నారు మంత్రి హరీశ్ రావు.