మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే చాలు.. బోలేడు ఆక్సిజన్‌!

-

ఈ విపత్కర పరిస్థితుల్లో తెల్లారితే చాలు ఆక్సిజన్‌ కొరతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కరోనా రోగులను చూస్తూనే ఉన్నాం. ఆక్సిజన్‌ కొరత వల్ల రోగులు చనిపోయిన వార్తలు కూడా ప్రతిరోజు వినాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే, ప్రకృతి సిద్ధమైన ఈ మొక్కల్ని మీ ఇంట్లో పెట్టుకుంటే ఇక మీ ఇంట్లో ఆక్సిజన్‌కు కొరత ఉండదు. అవి ఏ మొక్కలో తెలుసుకుందాం. అసలే ఎండాకాలం ఇంట్లో వేడి కూడా పెరుగుతూనే ఉంటుంది.

గాలిలో ఆక్సిజన్‌ శాతం తగ్గుముఖం పడుతుంది.ఇప్పుడు దీన్ని పరిష్కరించే దిశగా మనం ఇళ్లలో ఆక్సిజన్‌ అందించే మొక్కల్ని పెంచుకోవాలి. ఈ మొక్కలు బోలెడంత ఆక్సిజన్‌ను గాలిలోకి వదిలి, గదిలోని వేడిని పీల్చుకుంటాయి. ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్రాల్లో ఈ మొక్కలు ఎక్కువగా లభిస్తున్నాయి. సాధారణంగా ఈ మొక్కల ధరలు రూ.50 నుంచి రూ.500 పలుకుతున్నాయి. ఎంచక్కా ఇంట్లోనే వీటిని పెంచుకోవచ్చు. వీటికి ఎక్కువ నీరు కూడా అవసరం ఉండదు. కానీ, మనకు కావాల్సిన ఆక్సిజన్‌ను అందిస్తాయి. గాలిలో ఉన్న కార్బన్‌ డై ఆక్సైడ్‌ను పీల్చుకుంటాయి.

 

గాలిలో సరిపడా ఆక్సిజన్‌ ఉంటోందా అన్నది తేలాల్సిన ప్రశ్న. వేడి వల్ల ఒక్కోసారి ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో మనకు గాలి ఆడని ఫీలింగ్‌ కలుగుతుంది. కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పటికే చాలా మంది పెరటి గార్డెన్‌ను పెంచుతున్నారు. అదేవిధంగా ఇటువంటి ఆక్సిజన్‌ అందించే, ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ మొక్కల్ని కూడా ఇంటి వరండాలో, గార్డెన్‌ లో పెంచుకోవడానికి తీసుకెళ్తున్నారు. ఇవి అందంగా ఉండటమే కాక… ఆరోగ్యాన్ని పెంచుతున్నాయని అంటున్నారు. పగలైనా, రాత్రైనా అవి ఆక్సిజన్‌ నే విడుదల చేస్తాయి. ముఖ్యంగా మనీ ప్లాంట్‌ అంటారే అది 24 గంటలూ ఆక్సిజన్‌ రిలీజ్‌ చేస్తూనే ఉంటుంది.
దేశంలో కరోనా వల్ల అందరికీ ఆక్సిజన్‌ ప్రయోజనాలపై అవగాహన కలుగుతోంది. అలాగే ఆక్సిజన్‌ మొక్కలపైనా సదభిప్రాయం ఏర్పడుతోంది. అలాంటి వారంతా ఈ మొక్కలు తీసుకెళ్తున్నట్లు ఓ నర్సరీ ఓనర్‌ తెలిపారు.

ఆక్సిజన్‌ అందించే మొక్కలు

మనీ ప్లాంట్, స్నేక్‌ ప్లాంట్,రబ్బర్‌ ప్లాంట్, స్పైడర్‌ ప్లాంట్‌ , ఫిడిల్‌ లీఫ్‌ , అరెకా పామ్‌ మొక్క, క్రెస్‌ స్యూలా , అలోవెరా.

 

 

Read more RELATED
Recommended to you

Latest news