మహిళలు..మీ పెదవి మీద వెంట్రుకలు పెరగడానికి కారణం ఏంటో తెలుసా..?

-

అమ్మాయిలకు ముఖం మీద వెంట్రుకలు ఉంటే చూడ్డానికి అంత అందంగా కనిపించరు. అదేంటో తలమీద ఏమో జట్టు రమ్మన్నా రాదు..ఏదో ఒక సమస్య ఉంటుంది. ముఖం మీద మాత్రం వద్దురా బాబు అనుకున్నా కొంతమందికి వచ్చి ఇబ్బంది పెడుతుంది. వీటిని తొలగించుకోవటానికి ఇక అమ్మాయిలు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు షేవింగ్ చేస్తే…మరికొందరు వాక్స్ చేయించుకుంటారు. అయితే ఫేస్ మీద వ్యాక్స్ చేసుకోవటం అంత మంచిది కాదు..సున్నితమైన చర్మం కదా..పాడైపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఈ సమస్యను ‘హిర్సుటిజం’ గా పిలుస్తుంటారు.. వైద్యుల సహాయంతో కారణాలను అన్వేషించి, చికిత్స తీసుకోవాలి.

అసలు వెంట్రుకలు పెరగటానికి కారణాలు ఏంటో తెలుసుకోండి..

జన్యువులు: హిర్సుటిజం వంశపారంపర్యంగా రావొచ్చు.. అమ్మమ్మ, అమ్మ, మేనత్త, పిన్ని, అక్క… ఇలా రక్తసంబంధీకుల్లో ఇదే సమస్యతో బాధపడి ఉంటే, మీకూ ఈ సమస్య తప్పక వస్తుంది.

హార్మోన్ల హెచ్చుతగ్గులు: ఆండ్రోజెన్స్‌ అనే పురుష హార్మోన్‌ పరిమాణం పెరిగినా ఈ సమస్య వస్తుంది.. సహజసిద్ధంగా మహిళల శరీరాల్లో తక్కువ పరిమాణంలో ఉండే ఈ మేల్‌ హార్మోన్‌ కొన్ని సందర్భాల్లో పెరుగుతుంది. ఫలితంగా గడ్డం మీద వెంట్రుకలు పెరగడం, గొంతు మారడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.

మెనోపాజ్‌: ఈ దశలో మహిళల శరీరాల్లో ఈస్ట్రోజన్‌ స్రావం తగ్గుతుంది. గడ్డం, పై పెదవి మీద వెంట్రుకలు పెరగడానికి మెనోపాజ్‌ కూడా మరో కారణం.

పాలీసిస్టిక్‌ ఓవరీస్‌: నెలసరిలో అవకతవకలు, బరువు పెరగడం, ఫెర్టిలిటీ సమస్యలు ఈ సిండ్రోమ్‌ ప్రధాన లక్షణాలుగా చెప్పుకోవచ్టు..గడ్డం మీద వెంట్రుకలు పెరగడం ఈ సమస్యలో కనిపించే ప్రధాన లక్షణం.

ఇలా చేయొద్దు.

వీటిని తొలగించుకోవటానికి ఎన్నో పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవచ్చు. లేదా చాలా బ్యూటీటిప్స్ ఉంటాయి. వాటిని కూడా ఫాలో అయితే మెల్లిమెల్లిగా సమస్య తగ్గుతూ వస్తుంది. అయితే బ్లేడ్ లాంటి పరికరాలతో మాత్రం వీటిని తొలగించే ప్రయత్నం చేయకండి. అప్పుడు ఇంకా ఎక్కువగా పెరుగుతాయి. కాటట్టి ఆ పని అసలు చేయొద్దు. ఇంటి చిట్కాలతో కూడా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news