Work: కొత్తగా జాబ్ లో జాయిన్ అయ్యారా? కొలీగ్స్ తో అస్సలు షేర్ చేసుకోకూడని విషయాలు ఇవే

-

మీతో పాటు చదువుకున్న వారు మీ ఫ్రెండ్స్ అవుతారు. అలానే మీతో పాటు పనిచేసేవారు ఫ్రెండ్స్ అవుతారని అనుకుంటే మీకు ఇంకా వాస్తవ ప్రపంచం అర్థం కానట్టే లెక్క.

ఒక్కసారి పనిలో పడ్డాక మీకు ఫ్రెండ్స్ తగ్గిపోతూ ఉంటారు. కేవలం అవసరం కోసం మీకు దగ్గరకు వచ్చేవారో, లేదంటే మీ నుంచి దూరంగా పోయే మనుషులు మాత్రమే కనిపిస్తారు.

ఆ విషయం అటుంచితే.. మీరు ఒక ఆఫీసులో పని చేస్తున్నప్పుడు మీ కొలీగ్స్ తో కొన్ని విషయాలను షేర్ చేసుకోకూడదు. ఆ విషయాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

శాలరీ:

కొత్తగా జాయిన్ అయిన వాళ్లను శాలరీ ఎంత అని సీనియర్లు అడుగుతుంటారు. కామన్ సెన్స్ ఉన్నవారు అడగరు కానీ మామూలుగా కొందరు అడుగుతారు. నీ శాలరీని ఎక్కడా రివీల్ చేయాల్సిన పని లేదు. మీ శాలరీ వాళ్ళ కన్నా తక్కువైతే.. అతను మిమ్మల్ని చీప్ గా చూస్తాడు.

గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ బాయ్ ఫ్రెండ్స్:

ఇలాంటి విషయాలు అస్సలు షేర్ చేసుకోకూడదు. మీ పర్సనల్ విషయాలు మీ కొలీగ్స్ కి ఎంత తక్కువ తెలిస్తే అంత మంచిది.

రాజకీయాలు:

ఉదాహరణకు మీకు ఒక రాజకీయ నాయకుడు ఇష్టం అనుకుందాం. అతని గురించి మీరు తెగ మాట్లాడారు. ఆ నాయకుండంటే మీ సీనియర్ కో.. లేకపోతే మీ కొలీగ్ కో ఇష్టం లేదనుకోండి. దాని ప్రభావం అప్రైజల్స్ మీదనో ప్రమోషన్ మీదనో పడుతుంది.

సోషల్ మీడియా ప్రొఫైల్స్:

సోషల్ మీడియాలో మీరు చాలా రాసేస్తుంటారు. కొన్ని కొన్ని సార్లు అప్పటి మూడ్ కి తగ్గినట్టుగా పోస్ట్ చేస్తుంటారు. మీరు పోస్ట్ చేసింది కొలీగ్ కి కానీ సీనియర్ కి కానీ నచ్చలేదనుకో.. వాళ్ళ దృష్టిలో మీరు విలన్ అవుతారు.

చాడీలు:

మీ తోటి కొలీగ్ మీద చాడీలను కానీ గాసిప్స్ కానీ అస్సలు చెప్పకండి. మీ మాటలు అవతలి వాళ్లకు చేరే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news