నెల్లూరు జిల్లా.. వెంకటాచలం మండల కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా విజ్ఞప్తుల దినోత్సవం లో అత్యధికంగా పెన్షన్లు.. భూ సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయి. గత ప్రభుత్వం రీ సర్వే పేరుతో భూములను తారుమారు చేసింది. దీంతో పలువురు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎస్సీ ఎస్టీ కాలనీలలో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయలేదు. అయితే ప్రజా సమస్యలను సత్వరమే తీర్చాలని అధికారులను ఆదేశిస్తున్నాం అని స్పష్టం చేసారు.
అలాగే నియోజకవర్గంలోని గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సదస్సులను నిర్వహిస్తాం. ఈనెల 8న వెంకటాచలం మండలం చెమడుగుంటలో మొదటి సదస్సును నిర్వహిస్తున్నాం. గిరిజనులకు అవసరమైన ఆధార్ కార్డుల జారీ తో పాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తాం. వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తాం అని ఎమ్మెల్యే సోమిరెడ్డి పేర్కొన్నారు.