కాంగ్రెస్ బరితెగించింది.. బీఆర్ఎస్ ఖేల్ ఖతం : బండి సంజయ్

-

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై కేంద్రహోంసహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం కరీంనగర్‌లోని తన పార్టీ ఆఫీసులో ‘ఒవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’ అనే ఆన్‌లైన్ సమావేశంలో బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బరితెగించి పాలన చేస్తోంది. అస్తవ్యస్తంగా ఆ పార్టీ పాలన ఉంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేకుండా పోతున్నయ్.

హిందువులు ఆరాధించే దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా, హిందూ ధర్మంపై దాడులు జరుగుతున్నా రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పొలిటిక్స్ చేస్తోంది. ఒక సమస్య వస్తే దాన్ని పరిష్కరించకుండా మరో సమస్యను సృష్టించి కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోంది. హైడ్రా, మూసీ పునరుజ్జీవం, కుల గణన పేరుతో కేవలం ప్రచారం చేసుకుంటూ 6 గ్యారంటీలను దాట వేస్తోంది. ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాల్సింది పోయి.. అందుకు భిన్నంగా సీఎం ఇస్తున్న హామీలు, ఆయన చెప్పే మాటలకు విలువ లేకుండా పోయింది’ అని కేంద్రమంత్రి ఫైర్ అయ్యారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఆ పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత ఇంకా పోలేదని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news