శ్రీలంక బాంబు బ్లాస్ట్: కుటుంబంతో చివరి సెల్ఫీ తీసుకుంది.. పేలుళ్లలో చనిపోయింది

ఆ కుటుంబం అంతా కలిసి బ్రేక్ ఫాస్ట్ చేస్తూ సెల్ఫీ తీసుకున్నారు. ఆ కుటుంబంలోని ఓ యువతి నిసాంగ సెల్ఫీ తీసింది. ఆ ఫోటోను తన ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేసిన కొద్ది సేపటికే అక్కడ బాంబు పేలుడు సంభవించింది.

పవిత్ర ఈస్టర్ పర్వదినం రోజున శ్రీలంకలో ఉగ్రవాదులు చేసిన హింసాకాండ తెలిసిందే కదా. ఆదివారం కొలంబోలో జరిగిన పేలుళ్లలో ఇప్పటికే 300 మంది వరకు మరణించారు. మరో 500 మంది వరకూ గాయపడ్డారు. చాలామంది ఆచూకీ కూడా లభించలేదు.

అయితే.. శ్రీలంక పేలుళ్లలో మృత్యువాత పడ్డ ఒక్కొక్కరి విషాద ఇతివృత్తాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి. బ్రిటన్ లో స్థిరపడిన ఓ ఇండియన్ కుటుంబం రీసెంట్ గా శ్రీలంక టూర్ కు వెళ్లింది. శ్రీలంక క్యాపిటల్ కొలంబోలో ఉన్న షాంగ్రీ లా హోటల్ లో వాళ్లు బస చేశారు.

ఆదివారం ఉదయం ఆ కుటుంబం అంతా కలిసి బ్రేక్ ఫాస్ట్ చేస్తూ సెల్ఫీ తీసుకున్నారు. ఆ కుటుంబంలోని ఓ యువతి నిసాంగ సెల్ఫీ తీసింది. ఆ ఫోటోను తన ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేసిన కొద్ది సేపటికే అక్కడ బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో ఆ యువతి నిసాంగతో పాటు ఆ కుటుంబంలోని మరికొంతమంది మృతి చెందారు. ఇప్పుడు ఆ యువతి తీసిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కొలంబోలో మొత్తం మూడు హోటళ్లు మూడు చర్చీలు కలిపి మొత్తం 8 చోట్ల బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. వాటిలో ఆరు ఆత్మాహుతి దాడుటు. ఏడుగురు వ్యక్తులు ఆత్మాహుతి దాడికి యత్నించారు. ఇప్పటికే 24 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.