జయప్రద అనార్కలి అట.. నోరు జారింది ఎవరో తెలుసా?

జయప్రద ఇప్పటికే రెండు సార్లు రామ్ పూర్ నుంచి గెలిచారు. ఒకసారి మాత్రం ఓడిపోయారు. ఇదివరకే రెండు సార్లు ఆమె గెలవడంతో మరో సారి కూడా ఆమె గెలుపు ఖాయమేనని రాజకీయ వర్గాలు చెబుతుండటంతో ఆజంఖాన్ కు ఓటమి భయం పట్టుకున్నదట.

అలనాటి తార జయప్రద ఈసారి కూడా ఉత్తరప్రదేశ్ లోని రామ్ పూర్ నుంచే పోటీ చేస్తోంది. ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఆమెకు సమాజ్ వాది పార్టీ నుంచి ఆజాంఖాన్ ప్రత్యర్థిగా రంగంలోకి దిగారు. ఆయన ఆమెకు ఒకప్పటి మిత్రుడే.

Ajam khan son Abdulla khan compares jayaprada with anarkali

అయితే.. జయప్రద ఇప్పటికే రెండు సార్లు రామ్ పూర్ నుంచి గెలిచారు. ఒకసారి మాత్రం ఓడిపోయారు. ఇదివరకే రెండు సార్లు ఆమె గెలవడంతో మరో సారి కూడా ఆమె గెలుపు ఖాయమేనని రాజకీయ వర్గాలు చెబుతుండటంతో ఆజంఖాన్ కు ఓటమి భయం పట్టుకున్నదట. దీంతో జయప్రదపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నారని తెలుస్తోంది. కావాలని ఆమెపై అబద్ధపు ప్రచారాలు చేయడం, ఆమెను అసభ్యకరంగా ఆజంఖాన్ తిట్టడం మనం చూశాం.

తాజాగా ఆజంఖాన్ కొడుకు కూడా జయప్రదపై నోరు పారేసుకున్నారు. రాంపూర్ జరిగిన ఓ సభలో ఆజంఖాన్ కొడుకు అబ్దుల్లా ఖాన్ ఆమెను అనార్కలితో పోల్చారు. ఆమెను అనార్కలి అనడంతో స్పందించిన జయప్రద.. అబ్దుల్లా ఖాన్ మంచోడు అనుకున్నా కానీ.. ఇలా ఆజంఖాన్ కొడుకే అని నిరూపించుకున్నాడు. ఆయనా అదే కుటుంబం నుంచి వచ్చాడు కదా.. అయినా మహిళలను గౌరవించడం ఎలా తెలుస్తుందిలే అంటూ జయప్రద తనదైన శైలితో విమర్శించారు. ఇలా ఒకరిపై మరొకరు విమర్శించుకోవడం కొత్తేమీ కాదు కదా.