వందపెట్టాడు.. రూ. కోటి కొట్టాడు..

-

అదృష్టం అనేది ఎప్పుడూ.. ఎక్కడి నుంచి వస్తోందో ఆ దేవుడికే తెలుసు. సాధరణ వ్యక్తులను ఉన్నట్టుండి ఏకంగా లక్షధికారులు, కోటీశ్వరులుగా మారుస్తోంది. అలాంటి ఘటనే కర్నాటకలో చోటు చేసుకుంది. కర్నాటకలోని మండ్య జిల్లా మద్దూరు మండలానికి చెందిన శోహన్‌ బలరామ్‌ అనే యువకుడు ఈ నెల 5వ తేదీన కెరళలో బంధువుల పెళ్లి ఉండటంతో కుటుంబ సభ్యులతో కలిసి పయణమయ్యారు.

మరోసటి రోజు శోహన్, అక్కడే ఉంటున్న స్నేహితుడు దేవదాస్‌ ప్రభాకర్‌ను పలకరించేందుకు ఇంటికెళ్లాడు. ఇరువురు కాసేపు మాట్లాడుతకొని దేవదాస్‌ దుకాణంలో కూర్చున్నారు. ఈ క్రమంలో దుకాణంలోనే రూ.100 పెట్టి శోహన్‌ ‘కేరళ భాగ్యమిత్ర’ లాటరీని కొన్నాడు. ఆ తర్వాత శోహన్‌ బలరామ్‌ కుటుంబ సభ్యులతో కలిసి సొంత ప్రాంతమైన మండ్యకు కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో వెళ్తుండగా 3.30 ని.లకు బలరామ్‌కు పోన్‌ వచ్చింది. ‘ నువ్వు కొన్న టికెట్‌కు రూ. కోటి లాటరీ వచ్చింది.’ అని స్నేహితుడైన దేవదాస్‌ చెప్పడంతో ఆట పట్టించేందుకే చెబుతున్నాడని నవ్వుతూ ముందుకు సాగాడు.

మళ్లీ మళ్లీ బలరామ్‌ ఫోన్‌చేసి టికెట్‌ తీసుకొని వెనక్కి రావాల్సిందేనని పట్టుబట్టడంతో చేసేది లేక శోహన్‌ వెనుదిరిగాడు. అక్కడికి వెళ్లి డ్రాలో వచ్చిన నంబర్‌ చూసుకుంటే నిజంగానే శోహన్‌ నంబర్‌కు లాటరీ తగిలింది. దాదాపుగా 48 లక్షల మంది ఈ లాటరీ కొంటే అందులో కేవలం 5 మందికి మాత్రమే అదృష్టం వరిస్తుందని నిర్వాహకులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news