జొమాటోకు షాక్.. రేపటి నుంచి డెలివరీ బాయ్స్ సమ్మె… కారణం ఏంటో తెలుసా..?

-

సోమవారం నుంచి జొమాటో డెలివరీ బాయ్‌లు సమ్మె చేయనున్నారు. ఎందుకంటే.. జొమాటోలో ఉన్న హిందూ, ముస్లిం డెలివరీ బాయ్‌లందరూ తమ మత విశ్వాసాలను కించపరిచేలా పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జొమాటోలో ఇటీవల చోటు చేసుకున్న ఓ సంఘటన గురించి అందరికీ తెలిసిందే. ఫుడ్ డెలివరీ తీసుకువచ్చిన ఓ వ్యక్తి ముస్లిం మతస్థుడని చెప్పి ఒక హిందూ వ్యక్తి ఆ ఫుడ్ ఆర్డర్ తీసుకునేందుకు నిరాకరించాడు. దీంతో జొమాటో.. తాము డెలివరీ చేసే ఫుడ్‌కు మతం ఉండదని చెప్పింది. అయితే దీనిపై జనాలందరూ మిశ్రమ రీతిలో స్పందించారు. కొందరేమో ఈ విషయంలో జొమాటోకు మద్దతుగా నిలవగా, కొందరు జొమాటో చేసిన పోస్ట్‌ను తప్పు పట్టారు. ఫుడ్‌కు మతం లేదని చెప్పి హలాల్ చేసిన మాంసాన్ని హిందువులకు ఎందుకు అమ్ముతున్నారంటూ.. చాలా మందిని జొమాటోను నిలదీశారు. అయితే ఆ వివాదం ఇప్పటికి సద్దుమణిగినా.. ఇప్పుడు జొమాటోకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. అది కూడా ఆ కంపెనీ డెలివరీ బాయ్స్ విషయంలో కావడం గమనార్హం.

zomato delivery boys to conduct strike from monday

సోమవారం నుంచి జొమాటో డెలివరీ బాయ్‌లు సమ్మె చేయనున్నారు. ఎందుకంటే.. జొమాటోలో ఉన్న హిందూ, ముస్లిం డెలివరీ బాయ్‌లందరూ తమ మత విశ్వాసాలను కించపరిచేలా పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందూ డెలివరీ బాయ్‌లు బీఫ్ వంటకాలను డెలివరీ చేయాల్సి వస్తుందని, అలాగే ముస్లిం డెలివరీ బాయ్‌లు పోర్క్ వంటకాలను డెలివరీ చేయాల్సి వస్తుందని, అంతకన్నా నీచమైన విషయం మరొకటి లేదని, మత విశ్వాసాలను దెబ్బ తీసేలా పనిచేయాల్సి వస్తుందని, ఇకపై తాము ఇలా పనిచేయబోమని చెబుతూ.. జొమాటో డెలివరీ బాయ్‌లందరూ ఆందోళన చేపట్టనున్నారు.

ఇక జొమాటోలో తమకు అందుతున్న కమిషన్, మెడికల్, ఇతర సదుపాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని జొమాటో డెలివరీ బాయ్‌లు చెబుతున్నారు. అందుకనే తాము సోమవారం నుంచి సమ్మె చేపడుతున్నామని, అందులో భాగంగా నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతామని వారు తెలిపారు. జొమాటో స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై జొమాటో యాజమాన్యం ఇంకా స్పందించలేదు. మరి రేపటి నుంచి జొమాటో డెలివరీ బాయ్స్ సమ్మె కొనసాగుతుందో, లేదో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news