కొంత మంది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా జీవితంలో పైకి వెళ్ళచ్చు. ముంబై కి చెందిన పవిత్ర మరియు ఆమె భర్త జాబ్స్ ని కూడా వదిలేసుకుని వ్యవసాయం మొదలుపెట్టారు. ఈ మధ్య కాలం లో ప్రతిదీ కూడా మారిపోయింది. ఫాస్ట్ పేస్డ్ సిటీ లైఫ్ ని కాదనుకుని ఆరోగ్యకరమైన శుభ్రమైన ఆహారాన్ని పండించాలని అనుకున్నారు.
చక్కగా అనుకున్నది సాధించడానికి కృషి చేశారు. 2016లో పవిత్ర హెచ్ఆర్ జర్నలిస్ట్ జాబ్ ని వదిలేసుకుని వ్యవసాయంపై దృష్టి పెట్టింది. తన భర్త కూడా ఉద్యోగాన్ని వదిలేసుకుని పండించడం మొదలుపెట్టారు. 15 ఎకరాల భూమిలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి వీళ్లిద్దరు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు 20 ఎకరాలలో ఈ జంట 15 టన్నులని పండిస్తున్నారు. సంవత్సరానికి సుమారు 15 టన్నుల బియ్యాన్ని వాళ్లు 20 ఎకరాల్లో పండిస్తున్నారు.
ఈ మధ్యన ప్రతి ఒక్కరు వ్యవసాయం పైన దృష్టి పెడుతున్నారు వీళ్ళు కూడా ఎంతో కష్టపడి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి.. దాని ద్వారా మంచిగా సంపాదించుకుంటున్నారు. పైగా నచ్చినది చేయడంలో ఆనందం వేరు ఇలా మంచిగా కష్టాన్ని నమ్ముకుని నచ్చిన పనిని వీళ్ళు చేస్తున్నారు. ఏదో చేయాలని చేయలేకపోతున్న వాళ్ళు వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ఇలా మంచి వాటి కోసం కష్టపడితే తప్పక గెలవచ్చు.