బాలీవుడ్ సినిమా తీస్తున్న గాజీ డైరెక్టర్..! ఆర్మీ గెటప్ లో విద్యుత్ జమ్వాల్..!

-

 

gazi director sankalp reddy to debut in bollywood
gazi director sankalp reddy to debut in bollywood

గాజీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి. సైన్స్ ఫిక్షన్ జానర్ తో సినిమాలు తీయడం ఈయనకు అలవాటు. గాజీ సినిమాతో మనని సముధ్రం లోకి తీసుకెళ్ళాడు, కొంత సేపు మనని ఆ సముద్రపు నావలో ఆపేశాడు. ఇక మరో సినిమా అంతరిక్షం 9000 కిలోమీటర్లు తో మనని అంతరిక్షం లోకి తీసుకెళ్ళాడు ఇప్పుడు కొన్ని రోజులు ఆగితే మనని విమానం ఎక్కించి ఆకాశంలో తిప్పనున్నాడు యుద్ధం లోకి తీసుకెల్లే ప్రయత్నం చేస్తున్నాడు. బాలీవుడ్ ప్రముఖ నటుడు విద్యుత్ జమ్వాల్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ సైన్ చేశాడు. బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ కు సంకల్ప్ కథ చెప్పాడు విద్యుత్ కు కూడా కథ చాలా బాగా నచ్చింది దాంతో త్వరలో బాలీవుడ్ ప్రజలకు సంకల్ప్ పరిచయం అవ్వబోతున్నాడు. ఇక్కడ మనని మెప్పించినట్టే అక్కడి ప్రేక్షకులను మెప్పించేందుకు మరోసారి సైన్స్ ఫిక్షన్ జానర్ నే ఎంచుకున్నాడు సంకల్ప్. ఆ సినిమా లో విద్యుత్ జమ్వాల్ యుద్ధ విమానం నడిపే పైలట్ గా కనిపించనున్నాడు. ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ నేపద్యం లో కథ నడుస్తుంది. ఈ సినిమా కూడా నిజ జీవిత సన్నివేశాల ఆధారంగా ఉన్న కథ కావడం సినిమాకు మరో హైలైట్..! మొత్తానికి మన డైరెక్టర్ మన పవర్ ను సిక్స్ ప్యాక్ వీరుడు విద్యుత్ జమ్వాల్ తో ప్రజలకు చూపించడానికి రెడీ అయిపోతున్నాడు. ఈ సినిమా ని ఢిల్లీ ముంబై నగరాల్లో షూట్ చేయబోతున్నారు. కాగా సినిమా కు సంబంధించి పూర్తి వివరాలు చిత్ర యూనిట్ త్వరలో వెల్లడిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news