చాలా మందికి ఫస్ట్ నైట్ అనగానే ఒక ఆశ… ఏదేదో చేసేద్దాం అనే ఉత్సాహం. అనకూడదు గాని ఇలా అనుకున్న వాళ్ళు చాలా మంది నీరు గారిపోయారు. అవన్నీ మాకు ఎందుకులే గాని… శృంగారం మీద అవగాహన లేని చాలా మందికి ఫస్ట్ అనేది ఒక పండగే. అందుకే కలలు కనడం, ఊహించుకోవడం, ప్రాక్టీస్ చేయడం వంటివి చేస్తూ ఉంటారట. మేము చూడలేదు గాని ఎక్కడో విన్నది చెప్తున్నాం అంతేలే.
హా సరే వినండి ఇప్పుడు… అలా ఉత్సాహపడే ఉత్సాహ వంతులకు కొంత మంది కొన్ని సలహాలు ఇస్తున్నారు. ఫస్ట్ నైట్ మీద ఎక్కువ ఆశలు పెట్టుకుంటే అక్కడ మీకు అనుకున్నది దొరకకపోతే తొలి రాత్రే మంచం మీదే మీ కొత్త భార్యకు మీకు గ్యాప్ వస్తుందని చెప్తున్నారు. ఏంటి చులకనగా మాట్లాడుతున్నారు అంటారా…? చులకనగా మాట్లాడట్లేదు రాయట్లేదు. మీకు చెప్తున్నాం అంతే, సీరియస్ అవకండి.
ఫస్ట్ నైట్ గురించి ఎవడో ఏదో చెప్పాడని ఊహించుకుని తలుపు మూయవద్దు. ఎవడు ఎం చెప్పినా పట్టించుకోవద్దు. మీ భాగస్వామికి అవగాహన ఉన్నా లేకపోయినా నీకు తెలిసినా తెలియకపోయినా శృంగారం కొత్త అయితే మాత్రం సైలెంట్ గా నువ్వు చేసేది చేయడం బెస్ట్. ఇంకొక విషయం ఏంటీ అంటే మొదటి శృంగారం అంత గొప్పగా ఏమీ ఉండదు గాని మర్చిపోలేని విధంగా ఉంటుందట.
మీరు భాగస్వామి వద్ద ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండండి గాని అలాగే ఉండాలి అనుకుంటే మాత్రం మీరు ఒక వాస్తవాన్ని కోల్పోతారు. వాస్తవం ఏంటీ అనొద్దు… అక్కడ మీకు దొరికే నిజమైన అనుభవాన్ని కోల్పోతారు. అన్ని సార్లు చెయ్యాలి, ఇన్ని సార్లు చెయ్యాలి అనే ఆత్రం, కక్కుర్తి అసలు ఉండకూడదు. (ఈ రోజుల్లో అది ఎక్కువైంది కాబట్టే అలా చెప్తున్నాం గాని చులకన కాదులే.)
శృంగంలో ఉండే నగ్నం, సంభోగం, కౌగిలింత వంటి వాటి మీద అవగాహన లేకపోతే మీలో మీరు ఆలోచించుకోండి. ఇలా ఉండాలి అలా ఉండాలి అని. అంతే గాని ఒత్తిడికి గురి కావొద్దు. అబ్బాయిలను ఎక్కడ టచ్ చేస్తే వాళ్ళకు మంచి ఫీల్ వస్తుందో, అమ్మాయిలను ఎక్కడ టచ్ చేస్తే ఎలా అనిపిస్తుందో తెలుసుకోవాలి. టచ్ అంటే పచ్చడి చేసినట్టు, పిండి రుబ్బినట్టు కాదు… కంట్లో నలుసు తీసినంత సున్నితంగా.
దాని కంటూ ఒక పద్ధతి అవసరం. ఇంకో విషయం ఏంటీ అంటే వాళ్ళు సౌకర్యవంతంగా ఉన్నారో లేదో, వాళ్లకు అసలు ఇష్టం ఉందో లేదో, వాళ్ళ ఫీల్ ఎలా ఉందో తెలుసుకుని అప్పుడు మొదలుపెట్టండి. తలుపు వేసా కదా, బెడ్ లైట్ ఆన్ చేశా కదా, మంచం ఎక్కా కదా, చేసెయ్యాలి అన్నట్టు వద్దు. ఆత్రంతో చేస్తే మొదటికే మోసం వచ్చి మీకు శృంగారం పిచ్చి అనుకుని భయపడి చస్తారు అవతలి వాళ్ళు.
జాగ్రత్తగా… కూల్ గా, ఒక మంచి స్పర్శతో చెయ్యాలి. ఇంకొకటి ఏంటీ అంటే జననాంగాలను శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వాసన వస్తుంది అని అవతలి వారికి అనిపిస్తే మీరు ఎం చేసినా సరే వాళ్లకు ఫీల్ రాదట. (మాకు తెలీదు బాబూ ఎవరో చెప్తే మీకు చెప్తున్నాం అంతే)ఇంకొకటి దాపరికాలు, దాగుడు మూతలు, బొంబాయ్ కబుర్లు అసలు వద్దు.
చేసేది ఒక పద్ధతిగా నిజాయితీగా ఆత్రం లేకుండా చేస్తే చాలు. ఒప్పుకోలేదు అని బెదిరించి చెయ్యడం లాంటివి అసలు చేయవద్దు. వాళ్ళ సౌకర్యమే మీ సుఖం. అది తెలుసుకోండి ముందు… అవతలి వాళ్ళ ఆలోచన ఎలా ఉందో తెలుసుకోండి. ఫోర్ ప్లే అనేది చాలా అవసరం కాబట్టి దాన్ని లైట్ తీసుకోవద్దు. (మాకు తెలియదు ఫోర్ ప్లే అంటే ఏంటో, గూగుల్ చేసుకోండి) ఎక్కువగా దృష్టి సారించాలి.
లిప్ లాక్ కూడా చాలా అవసరం… కొన్ని పార్ట్స్ ని టచ్ చేస్తే అవతలి వ్యక్తికి ఫీల్ వస్తుంది. సిగ్గు, మొగ్గ అంటే ఏమీ ఉండదు. అవి చేస్తేనే శృంగారం ఎంజాయ్ చేస్తారు. వాళ్లకి అంటూ ఫీల్ వస్తుంది. పొజీషన్ కూడా చాలా అవసరం. ఎలా పడితే అలా చేస్తే నొప్పులు రావడం, రక్తాలు కారడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి. జాగ్రత్తగా, చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాం కక్కుర్తి వద్దు ప్లీజ్ నా…? మీకోసమే చెప్పేది. వినకపోతే మీ ఖర్మ.