ఇంట్లో బీరువాని పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చెయ్యద్దు..!

-

మనం మన ఇంట్లో సామాన్లని వాస్తు ప్రకారం సర్దుకుంటే అంతా మంచి జరుగుతుంది. కొన్ని పొరపాటులని మాత్రం అస్సలు చేయకూడదు ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి అనేది మనం చూసుకుని దానికి తగ్గట్టుగా ఇంట్లో వస్తువులని అమర్చుకుంటే మంచిది అలాంటప్పుడు పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. ఇంట్లో మనం డబ్బులు పెట్టే ప్రదేశం పట్ల కూడా శ్రద్ధ పెట్టాలి.

అందరూ బంగారం, డబ్బుల్ని బీరువాలో పెట్టుకుంటూ ఉంటారు. బీరువాలో లక్ష్మీదేవి ఉండాలంటే ఈ తప్పులను అస్సలు చేయకూడదు బీరువా విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు ఎలాంటివి కచ్చితంగా పాటించాలి అనేది చూసేద్దాం. బీరువా తలుపులు తెరిచి తలుపులు వేయడం మర్చిపోతే లక్ష్మీదేవి కచ్చితంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఎప్పుడు కూడా బీరువాని కాళ్లతో తన్న కూడదు అప్పుడు అదృష్ట లక్ష్మి అనుగ్రహం కాస్త పోతుంది.

స్నానం చేయకుండా బీరువా తెరిస్తే కూడా మంచి జరగదు అలా చేశారంటే ధన లాభం పొందే యోగం బాగా తగ్గుతుంది. చీపురుతో ఇంటిని తుడిచేటప్పుడు బీరువాని చీపురుకి తాకించకూడదు అది కూడా తప్పే. బీరువాలో పసుపు కొమ్ములు లక్ష్మీ గవ్వలు పెడితే అదృష్టం కలుగుతుంది కర్పూరాన్ని పెడితే కూడా మంచిది. బీరువాకి అద్దం ఉండకుండా చూసుకోండి అద్దం ముందు నిలబడి మనం మనల్ని చూసుకుంటే అమ్మవారికి కోపం కలుగుతుంది. చూశారు కదా బీరువా విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదని మరి ఇటువంటి పొరపాట్లు చేయకుండా ఖచ్చితంగా వీటిని పాటించండి అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news