జనగామ పంచాయితీ..ఫైనల్‌గా తేల్చింది ఇదే.!

-

చాలా రోజుల నుంచి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అంశం వివాదాస్పదం అవుతున్న విషయం తెలిసిందే. ఆయన ఎక్కువ వివాదాలతోనే సావాసం చేస్తున్నారు. ఆ మధ్య భూ ఆరోపణలు రావడం, సొంత కుమార్తె ఆయనపై విరుచుకుపడటం జరిగింది. ఇవే కాదు అనేక అంశాల విషయంలో ఎమ్మెల్యేకు యాంటీ వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో నెక్స్ట్ ఎన్నికల్లో ఆయనకు సీటు లేదనే ప్రచారం జరుగుతుంది.

ముత్తిరెడ్డి స్థానంలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సీటు ఇస్తారనే ప్రచారం సాగుతుంది.       అలాగే స్థానిక నేతలు పోచంపల్లికి సీటు ఇస్తున్నట్లు మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముత్తిరెడ్డి..పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. అయితే టికెట్ విషయంలో మొదట స్థానిక ఎమ్మెల్యేకే ప్రాధాన్యత ఉంటుందని పల్లా తనతో చెప్పారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఖచ్చితంగా తనకే సీటు ఇస్తారనే అంశం మాత్రం చెప్పడం లేదు. దీని బట్టి చూస్తే ముత్తిరెడ్డికి సీటు లేదని తేలిపోయింది. దాదాపు పోచంపల్లికి సీటు ఫిక్స్ అని చెప్పవచ్చు.

అయితే ఒకప్పుడు జనగామ అంటే కాంగ్రెస్ కంచుకోట. పొన్నాల లక్ష్మయ్య నాలుగుసార్లు జనగామ నుంచి గెలిచారు. తెలంగాణ ఏర్పాడ్డాక జరిగిన 2014 ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ నుంచి ముత్తిరెడ్డి గెలిచారు. ఇక 2018 ఎన్నికల్లో కూడా ఆయనకే సీటు దక్కింది. విజయం సాధించారు. కానీ ఈ సారి ముత్తిరెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అటు కాంగ్రెస్ నేత పొన్నాలపై సానుభూతి ఉంది. పైగా ఇదే లాస్ట్ ఛాన్స్ అన్నట్లు పోరాడుతున్నారు.

దీంతో ముత్తిరెడ్డికి సీటు ఇస్తే ఖచ్చితంగా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆయన్ని తప్పించి పోచంపల్లికి సీటు ఇస్తున్నట్లు తెలిసింది. మొత్తానికైతే జనగామ సీటులో మార్పు ఖాయమని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news