ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా వున్నాయంటే..?

పసిడి ప్రియులకి కాస్త రిలీఫ్ గానే ఉంటుంది. నిన్న పైకి కదిలిన బంగారం ధర ఈరోజు అదే విధంగా కొనసాగుతోంది. వీటి ధరలు నిలకడగా వున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… బంగారం ధర స్థిరంగా వుంది. కానీ వెండి మాత్రం వెలవెలబోయింది. దీని ధర కిందకి వచ్చింది.

gold/  బంగారం/

గ్లోబల్ మార్కెట్‌లో ధరలు ఎలా వున్నాయి అనేది చూస్తే.. బంగారం, వెండి ధరలు అక్కడ పడిపోయాయి. గురువారం బంగారం ధర నిలకడగానే కొనసాగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.50,070 వద్దనే స్థిరంగానే కొనసాగుతోంది.

ఇది ఇలా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా అలానే వుంది. రూ.45,900 వద్ద స్థిరంగా వుంది. అంతర్జాతీయ మార్కెట్‌ లో మాత్రం బంగారం ధర పడి పోయింది. 0.26 శాతం క్షీణించింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1890 డాలర్లకు తగ్గింది.

ఇక వెండి రేటు చూస్తే రూ.200 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ.76,200కు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ఔన్స్‌కు 0.54 శాతం తగ్గుదలతో 27.84 డాలర్లకు క్షీణించింది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్ మొదలైన కారణాల ప్రభావం ఈ రేట్లు మీద పడుతుందన్న సంగతి తెలిసిందే.