నిజామాబాద్: వివాహేతర సంబంధం.. ఎస్సైపై కేసు నమోదు..

వివాహేతర సంబంధాలు విషాదంలోకి దారి తీస్తున్నాయి. పెళ్ళయ్యాక మరొకరితో సంబంధం పెట్టుకుని, తమ వారిపై దాడులు చేయడం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకు కారణం అవుతుంది. తాజాగా నిజామాబాద్ లో జరిగిన సంఘటన అందుకు ఉదాహరణగా నిలుస్తుంది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో శివాజీ అనే వ్యక్తి, తన భార్యతో నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి ఎస్సై వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని మనస్తాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ మేరకు ఇందల్వాయి ఎస్సై శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు చేసారు. ఆత్మహత్యకి ప్రేరేపించారంటూ ఎస్సై శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదైంది. మృతుడు శివాజీ భార్య సంతోషి పై ఏ1, ఎస్సై శివప్రసాద్ రెడ్డిపై ఏ2గా కేసు నమోదైంది. ఈ మేరకు గాంధారి పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసారు.