ఉప ఎన్నికల్లో వా(ఓ)డిన కమలం…

-


దేశ వ్యాప్తంగా మోదీ హవా వీస్తోంది అంటూ ప్రగల్భాలు పలికిన వారికి కర్ణాటక ఎన్నికలు గట్టి బుద్ధి చెప్పాయి. కర్ణాటక ఉప ఎన్నికల్లో భాజపా ఘోర పరాభవం చవిచూసింది. 3 లోక్‌సభ స్థానాలు, 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా.. నాలుగు చోట్ల అధికార కాంగ్రెస్‌-జేడీయూ కూటమి జయకేతనం ఎగురవేసింది. దీంతో ఒకే ఒక్క స్థానానికి భాజపా పరిమితం అయింది. బళ్లారి, శివమొగ్గ, మాండ్య లోక్‌సభ స్థానాల్లో సిట్టింగ్‌ ఎంపీలు రాజీనామా చేయడంతో పాటు, రామనగర శాసనసభ స్థానాన్ని సీఎం కుమారస్వామి వదులుకోవడం, జమఖండీ ఎమ్మెల్యే మృతిచెందడటంతో ఈ స్థానాల్లో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. గత శనివారం ఉపఎన్నికలు నిర్వహించి.. నేడు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఫలితాల్లో కాంగ్రెస్‌-జేడీయూ కూటమి భారీ విజయం సాధించింది. దేశ వ్యాప్తంగా మోదీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనడంలో ఈ ఉప ఎన్నికల ఫలితాలే సాక్ష్యం అంటూ కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news