విజయ్ ‘సర్కార్’ రివ్యూ & రేటింగ్

-

vijay sarkar movie review rating

తుపాకి, కత్తి లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా సర్కార్. సన్ పిక్చర్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాలో విజయ్ కు జోడీగా కీర్తి సురేష్ నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. మరి ఈరోజు తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

తను ఏ దేశంలో అడుగు పెట్టినా సరే ఆ దేశంలోని కంపెనీలన్ని దెబ్బతీసి.. వాటిని మూసేయించేలా చేసే కార్పోరేట్ క్రిమినల్ సుందర్ రామస్వామి (విజయ్) తన ఓటు హక్కు వినియోగం చేసుకునేందుకు వస్తాడు. అతని ప్లేస్ లో ఎవరో దొంగ ఓటు వేశారని గుర్తించిన సుందర్ కోర్ట్ కేసు వేస్తాడు. సుందర్ ఓటు హక్కు వినియోగించుకునేలా కోర్ట్ ఎలక్షన్ కౌంటింగ్ ఆపేస్తుంది. హీరోలానే తమ ఓట్లు దొంగల పాలయ్యాయని 3 లక్షల మంది కేసులు వేస్తారు. ఆ దెబ్బతో ఎన్నికలను రద్దు చేసి మళ్లీ 15 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆర్డర్స్ వేస్తుంది. ఈ టైంలో అధికార పార్టీ నేతలని టార్గెట్ చేసిన సుందర్ స్వయంగా రాజకీయాల్లోకి దిగుతాడు. కార్పోరేట్ క్రిమినల్ సుందర్ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు..? రాజకీయ పార్టీలతో ఎలా పోరాడాడు..? అన్నది సినిమా కథ.

ఎలా ఉందంటే :

మురుగదాస్, విజయ్ కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో సర్కార్ విఫలమైంది. తుపాకి, కత్తి సినిమాలానే సర్కార్ సినిమాకు కథ బాగానే రాసుకున్న మురుగదాస్ కథనం విషయంలో తప్పులు చేశాడు. అంతేకాదు మొదటి భాగం స్పీడ్ గా లాగించినా సెకండ్ హాఫ్ మాత్రం మరి స్లో అయ్యింది.

సినిమాలో విజయ్ ను సరిగా వాడుకోలేదని చెప్పాలి. బడ్జెట్ ఫ్రీడం ఉంది కాబట్టి క్వాలిటీ బాగా వచ్చింది. అయితే మురుగదాస్ ఇదవరకు సినిమాల విషయంలో ఉండే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే మాత్రం మిస్సైంది. కేవలం విజయ్ ఫ్యాన్స్ ను ఎంటర్టైనర్ చేసేలా సినిమా ఉందని చెప్పొచ్చు.

ఇక విజయ్ రియల్ లైఫ్ పొలిటికల్ కెరియర్ కు ఈ సర్కార్ ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఆ విధంగా కథనం సాగుతుంది. ఇక సినిమాలో పాత్రధారులంగా తమిళులే కావడం వల్ల తెలుగు ఆడియెన్స్ కు పెద్దగా నచ్చే అవకాశం లేదు. హీరోయిన్ కీర్తి సురేష్ ను కూడా సరిగా వాడుకోలేదు. కేవలం హీరోయిన్ కావాలన్న ఉద్దేశంతో ఆమెని తీసుకున్నారనిపిస్తుంది. సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర చిన్నదే అయినా మెప్పించింది.

ఎలా చేశారు :

విజయ్ తన పాత్ర వరకు బాగానే చేశాడు. ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. యాక్షన్, ఫైట్స్ అన్ని విజయ్ ఫ్యాన్స్ కు నచ్చేలా ఉంటాయి. కీర్తి సురేష్ ఈ సినిమా ఎందుకు చేసిందో ఆమెకే తెలియాలి. హీరోయిన్ కు ఏమంత ప్రాముఖ్యత లేదు. వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర ఆకట్టుకుంది. రాధారవి, కరుయప్ప వారి పాత్రల్లో అలరించారు.

సినిమాకు గిరీష్ గంగాధరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు బడ్జెట్ లిమిటేషన్స్ లేవు కాబట్టి కెమెరా మెన్ వర్క్ క్వాలిటీ రూపంలో కనబడుతుంది. ఇక రహమాన్ మ్యూజిక్ అంతగా మెప్పించలేదు. సాంగ్స్ అంతగా ఆకట్టుకోకున్నా బిజిఎం అలరించింది. ఇక కథ, కథనాల్లో దర్శకుడు మురుగదాస్ తన పనితనం చూపించలేదు. పొలిటికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఇదవరకు వచ్చిన కొన్ని సినిమాలను రిఫరెన్స్ గా వాడుకుని సీన్స్ రాసుకున్నాడు మురుగదాస్. సినిమా నరేషన్ కూడా మెప్పించలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి

ప్లస్ పాయింట్స్ :

విజయ్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

స్టోరీ

స్క్రీన్ ప్లే

లాజిక్ లెస్ సీన్స్

బాటం లైన్ :

విజయ్ సర్కార్ అంచనాలను అందుకోలేదు..!

రేటింగ్ : 2/5

Read more RELATED
Recommended to you

Latest news