కారిడార్ 1 లోని ఎల్‌బీ నగర్-మియాపుర్ మార్గంలో అత్యధికంగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీయస్ రెడ్డి తెలిపారు. మెట్రో భవన్, హెచ్‌ఎమ్‌ఆర్‌ఎల్, ఎల్ అండ్ టి మెట్రో రైలు హైదరాబాద్ లిమిటెడ్ ఉన్నతాధికారులు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఎన్వీయస్ రెడ్డి మాట్లాడుతూ.. అత్యంత రద్దీ సమయంలో ప్రతి 3.15నిమిషాలకు మెట్రోని నడుపుతున్నామన్నారు. ఎల్‌బీ నగర్-మియాపూర్‌ల మార్గంలో ప్రతిరోజు 21రైళ్లు, నాగోల్-అమీర్‌పేట్‌ల నడుమ 12రైళ్లు ఇలా మొత్తంగా 33 రైళ్లు నడుపుతున్నామని తెలిపారు. మెట్రో రాకతో నగరంలో రోడ్లపై ప్రయాణించే ద్విచక్రవాహనదారుల సంఖ్య కాస్త తగ్గిందని వారు పేర్కొన్నారు.