షేడ్స్ ఆఫ్ సాహో.. దుమ్ముదులిపేశారంతే..!

-

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న మూవీ సాహో. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 అంటూ ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. 50 రోజుల ప్రిపరేషన్స్.. 400పైగా యూనిట్ సభ్యుల కష్టం.. అబుదాబిలో 30 డేస్ షూటింగ్ అన్నిటిని చూపిస్తూ షేడ్స్ ఆఫ్ సాహో మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.

ఈ వీడియో చూసి ప్రతి తెలుగు సిని అభిమాని బాలీవుడ్ క్వాలిటీ మేకింగ్ తో మన తెలుగు సినిమా వస్తున్నందుకు గర్వపడతాడు. కచ్చితంగా ప్రభాస్ నేషనల్ ఇమేజ్ కు తగినట్టుగానే ఈ సినిమా తెరకెక్కుతుందని చెప్పొచ్చు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా చాప్టర్ 1 అదరగొట్టారని చెప్పొచ్చు. ఒక్క సినిమా అనుభవమే ఉన్నా సుజిత్ టేకింగ్ మాటల్లేవనేలా ఉంది. మరి సినిమా మేకింగ్ వీడియోనే ఇలా ఉంటే సినిమా ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news