వచ్చే ఏడాదిలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టగా తాజాగా చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ సైత అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెడతారని తెలుస్తుంది యువ గళం నవ శకం బహిరంగ సభ నుంచి ఈ ఎన్నికలకి సమర శంఖం చంద్రబాబు పూరిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈసారి ఏపీలో ఎన్నికలు షెడ్యూల్ కంటే ముందుగానే జరగనున్నట్లు సమాచారం. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే తెలంగాణలో 15 రోజుల ముందే ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
ఏపీలో ఈసారి ఎన్నికలు 21 రోజుల కంటే ముందుగానే జరగనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 15 నుంచి 20 మధ్యలో ఎన్నికల యొక్క నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. గతంలో ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 3న వెలువడిన సంగతి తెలిసిందే.ఏపీలో బోగస్ ఓట్ల పైన టిడిపి మరియు వైసీపీ చేస్తున్న ఫిర్యాదుల పైన కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆరా తీస్తున్నట్లు సమాచారం