ఏపీలో క‌రోనా వ్యాక్సిన్ విక‌టించి వ్య‌క్తి మృతి..?

ఏపీలో క‌రోనా వ్యాక్సిన్ విక‌టించడంతో వ్య‌క్తి మృతి చెందిన‌ట్టు తెలుస్తుంది. గన్నవరం మండలం మర్లపాలెంకు చెందిన షేక్ సుభాని (30సం) కరోనా వ్యాక్సిన్ వికటించడంతో మృతి చెందిన‌ట్టు తెలుస్తోంది. నిన్న సాయంత్రం గన్నవరం పంచాయతీ లో సుభాని కోవిషిల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న త‌రవాత నిన్న రాత్రంతా జ్వరం వాంతులు… విరోచనాలతో సుభాని మ‌ర‌ణించార‌ని బంధువులు ఆరోపిస్తున్నారు.

8 నెలల క్రితం సుభాని భార్య అనారోగ్యంతో తో మృతి చెందింది. దాంతో 6 నెలల పిల్లవాడి ఆలనా పాలనా తండ్రి సుభానినే చూసుకుంటున్నారు. ఇప్పుడు తండ్రి కూడా మ‌ర‌ణించడంతో వ్యాక్సిన్ 6 నెలల పసికందు అనాథ‌గా మారిపోయాడు. సుభాని తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే బంధువులు వ్యాక్సిన్ విక‌టించి మృతి చెందాడ‌ని చెప్పారు. కానీ వైద్యాధికారులు ఇంకా నిర్ధారించ‌లేదు.