ఈనెల 22న అయోధ్యలో జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. అంతేకాకుండా దేశ విదేశాల నుండి ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా హాజరుకాబోతున్నారు.ఈ రామమందిరం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరఫున ఆహ్వానం పంపించారు.
దీంట్లో భాగంగా మాజీ సీఎం , బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు కూడా ఆహ్వానపత్రం పంపించారు. అయితే, ఆయనకు ఇటీవలే సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రిలో తుంటి ఎముక ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బంజారాహిల్స్ నందినగర్ లోని నివాసములో విశ్రాంతి తీసుకుంటున్నందువలన ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.