తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌క అధికార నివాసమైన ప్రగతిభవన్‌లో రాజకీయ సమావేశాల నిర్వహణపై వివరణ కోరుతూ ఎన్నికల కమిషన్ శుక్రవారం నోటీసులు జారీచేసినట్లు సమాచారం. ప్రగతి భవన్లో కేసీఆర్ రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్,తెదేపా, సీపీఐ, టిజెఎస్ నాయకులు ఈసీకి గురువారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదుని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్.. సిఎస్ ఎస్‌కె జోషి, ఆపద్ధర్మ సిఎం కెసిఆర్‌ను వివరణ కోరారు.. అధికారుల అండతో ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష నాయకుల వాహనాలను ఎక్కడబడితే అక్కడ ఆపటం, తనిఖీల పేరుతో వేధించడంపై కూడా వివరణ కోరింది. దీనికి సంబంధించి సీఈఓ రజత్ కుమార్ డిజిపి మహేందర్ రెడ్డిని వివరణ కోరుతూ లేఖ రాశారు.రు. ఎంఎంటీఎస్ రైళ్లలో ఆపద్ధర్మ కేసీఆర్ ఫోటోలతో ప్రకటనలు ఎందుకు తొలగించలేదంటూ ఈసీ రైల్వే శాఖను ప్రశ్నించింది.