కేసీఆర్ నెంబర్ వన్ కాబట్టే తెలంగాణ నెంబర్ వన్ : హరీశ్‌రావు

-

నిమ్స్ ఆసుపత్రిలో దశాబ్ది బ్లాక్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన సందర్భంగా తెలంగాణ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఏ శాఖ తీసుకున్నా తెలంగాణనే నెంబర్ వన్ అని స్పష్టం చేశారు.
కేసీఆర్ నెంబర్ వన్ కాబట్టే తెలంగాణ కూడా నెంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఆచరిస్తుంది… దేశం అనుసరిస్తుంది అని హరీశ్ రావు వివరించారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు, కందిళ్ల మోతలు ఉండేవని… కేసీఆర్ పాలనలో కరెంటు వెలుగులు, కంటి వెలుగులతో ఉజ్వలంగా ఉందని వెల్లడించారు.

దశాబ్దం ముంగిట నిలిచిన తెలంగాణ 76 ఏండ్ల చరిత్ర కలిగిన స్వతంత్ర భారతానికి ఆదర్శ రాష్ట్రంగా రూపుదిద్దుకోవడం ఒక అసాధారణ పరిణామం. ఈ అద్భుతానికి కర్త, కర్మ, క్రియ అన్నీ తానై నిలిచారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు. మంత్రమేస్తెనో, మాయ చేస్తెనో జరిగిన అద్భుతం కాదిది. ప్రజలే కేంద్ర బిందువుగా, వారి సమస్యలే ఇతివృత్తంగా సంపూర్ణమైన అవగాహన, నిజాయితీతో కూడిన నిబద్ధత, నిర్విరామ కృషి… ఈ మూడింటి వల్లనే ఈ అసాధారణ ప్రగతి సాధ్యమైంది అన్నారు మంత్రి హరీష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version