గవర్నర్ తమిళిసై ఎరుకల సామాజిక వర్గానికి అన్యాయం చేశారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో ఉన్న చందన చెరువు కట్టపై ఏకలవ్యుని విగ్రహాన్ని మేయర్ దుర్గా దీప్‌లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేష్,ఎరుకల సంఘం నాయకులతో కలిసి విగ్రహాన్ని సవిత ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాడు ఎరుకల సామాజిక వర్గం నుంచి సత్యనారాయణను ఎమ్మెల్సీగా కేసీఆర్ ఎంపిక చేసి గవర్నర్‌కు పంపిస్తే ఆమె తిరస్కరించారని వెల్లడించారు. ఎరుకల సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ పదవి రాకుండా అడ్డుకాలు గవర్నర్ తమిళిసై వేసింది అని పేర్కొన్నారు. గవర్నర్ కారణంగానే ఎరుకల కులానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నాంచరమ్మ జాతరకు కేసీఆర్ పది లక్షలతో పాటు జాతర్లకు బోనాలకు, అన్ని పండుగలకు బి ఆర్ ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయించినారు అని ఆమె తెలిపింది. కెసిఆర్ అన్ని కుల సంఘాలను ఒకే విధంగా చూసే వారిని తెలిపింది.ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం నాయకుడు నాగయ్య , పోరెడ్డి పద్మ, కార్పొరేటర్లు భూపాల్ రెడ్డి, కామేష్ రెడ్డి,, తదితరులు ఉన్నారు.