జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌11 కౌంట్ డౌన్ స్టార్ట్

-


భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం (ఇస్రో) బుధవారం జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌11 ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌11 వాహక నౌక ద్వారా జీశాట్‌-7ఏ ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలో ప్రవేశ పెట్టడానికి కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ఈ మధ్యాహ్నం 2.10 గంటలకు ప్రారంభించారు.ఈ ప్రక్రియ 26 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగనుంది. దీంతో రేపు సాయంత్రం 4.10 గంటలకు జీశాట్‌ – 7ఏ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇది ఎనిమిదేళ్ల పాటు సేవలందించనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో కు మరో విజయం చేకూరాలని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news