తెలంగాణ బీజేపీ చీఫ్ మార్పు ఉంటుందా : కిషన్ రెడ్డి

-

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తో విభేదాలు మరియయు అంతర్గత కుమ్ములాటలు ఉన్న కారణంగా అతనిపై అధిష్టానం వేటు వేస్తుందని రాజకీయ వర్గాలలో అనుమానాలు రేకెత్తాయి. అయితే తాజాగా ఈ విషయంపై తెలంగాణ నుండి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు. ఈయన మాట్లాడుతూ బీజేపీ అధ్యక్షుడిని మార్చాలన్న ఆలోచనలో బీజేపీ అధిష్ఠానము లేదన్నారు. కేవలం రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలను అధిగమించి పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లని అన్న అంశంపైనే అధిష్టానం బండి సంజయ్ కు సలహాలు ఇచ్చిందని క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై వస్తున్న వార్తలను ఎవ్వరూ నమ్మొద్దు అంటూ కార్యకర్తలకు మరియు రాజకీయ వర్గాలకు సెలవిచ్చారు కిషన్ రెడ్డి.

అధిష్టానానికి బండి సంజయ్ నాయకత్వంపై పూర్తి నమ్మకం ఉంది, కాబట్టి అధ్యక్షుడు మార్పు జరగదు అంటూ కిషన్ రెడ్డి చెప్పారు

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version