అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన గీతం విద్యా సంస్థల అధినేత, టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి భౌతికకాయ ఆదివారం ఉదయం 7.30గంటలకు విశాఖ చేరింది. ఈ రోజు మధ్యాహ్నం అంత్యక్రియలు గీతం యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్నారు. మూర్తి మృతదేహాన్నివిశాఖ విమానాశ్రయం నుంచి ఊరేగింపుగా ఆయన నివాసానికి తీసుకెళ్లారు. ప్రజల సందర్శనార్ధం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉంచుతారు. అనంతరం ఎన్టీఆర్ భవన్కు తరలించి, అక్కడ నుంచి అంతిమయాత్ర ఆరంభమవుతుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు, ఇతర ప్రముఖులు మూర్తికి నివాళులర్పించనున్నారు.