గత ఏడు సంవత్సరాలుగా ఐపీఎల్ టోర్నీకి దూరమైనప్పటికీ మిచెల్ స్టార్క్ ని దక్కించుకోవడానికి ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. స్టార్క్ ని సొంతం చేసుకోవడానికి ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ పోటీలోకి వచ్చిన చివరికి కేకేఆర్ అతడిని కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా రూ. 24.75 కోట్లకు కోల్కత్తా దక్కించుకున్న విషయం తెలిసిందే.
2015 లో బెంగళూరు తరఫున చివరి మ్యాచ్ ఆడిన స్టార్క్ ఇన్ని సంవత్సరాలు ఈ టోర్నీకి ఎందుకు దూరంగా ఉన్నాడనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
స్టార్క్ స్పందిస్తూ…. టెస్ట్ క్రికెట్ అంటే తనకెంతో ఇష్టమని అంతర్జాతీయ స్థాయిలో ఆస్ట్రేలియా తరఫున ఆడేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పాడు. నేను ఐపీఎల్ టోర్నీకి దూరం అయినందుకు బాధగా లేదని అన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే నేను ఈ టోర్నీకి దూరం కావడం వలన టెస్ట్ క్రికెట్లో నా ప్రదర్శన మెరుగుపడింది. వచ్చే ఏడాది జరగబోయే టి20 ప్రపంచ కప్ కి ఐపీఎల్ లో ఆడే అనుభవం ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు.