ప్రజలారా జాగ్రత్త, టీడీపీ ముఠా సరికొత్త మోసం: సజ్జల రామకృష్ణారెడ్డి

-

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలన్న కసితో టీడీపీ అష్టకష్టాలు పడుతోంది. ఇందుకోసం పాదయాత్ర, బస్సు యాత్ర అంటూ ఊర్లపై పది తిరుగుతోంది టీడీపీ. ఇక తాజాగా టీడీపీ చేస్తున్న బాబు ష్యురీటి భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ చేస్తున్న కార్యక్రమంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక రేంజ్ లో విరుచుకుపడ్డాడు. తాజాగా సజ్జల మాట్లాడుతూ, టీడీపీ దొంగల ముఠా కొత్తగా లోక మోసానికి తెరలేపింది అంటూ స్టార్ట్ చేశాడు. బాబు ష్యురీటి భవిష్యత్తుకు గ్యారంటీ అన్న పేరుతో టీడీపీ దొంగలు ముఠా ఊర్లపై పడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని, టీడీపీ గెలిస్తే ఈ పథకాలు వస్తాయంటూ సమాచారాన్ని సేకరిస్తున్నారు అంటూ సజ్జల చెప్పాడు.

ఈ విధంగా ప్రజల దగ్గర నుండి ఫోన్ నెంబర్ మరియు ఓటర్ కార్డు తీసుకోవడం సైబర్ క్రైమ్ అంటూ టీడీపీ నేతలపై సజ్జల రెచ్చిపోయి మాట్లాడారు. ఇలా మీ దగ్గర నుండి తీసుకున్న డేటా తో ఏమైనా చేసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి అంటూ అందరికీ చెప్పారు సజ్జల.

Read more RELATED
Recommended to you

Latest news