కేటీఆర్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు.. చర్యలు తీసుకునే అవకాశం..!

-

మంత్రి కేటీఆర్ ప్రచార తీరుపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ భవనాలలో కేటీఆర్ ఇంటర్వ్యూలు, న్యూస్ పేపర్‌లో తప్పుడు ప్రకటన ఇవ్వడంపై కాంగ్రెస్ కంప్లైంట్ చేసింది. మూడు రోజుల పాటు కేటీఆర్‌ను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ భవనం (టీ-హబ్)లో విద్యార్థులు, యువతతో కేటీఆర్ మీటింగ్ పెట్టి ప్రచారం చేయడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్నికల ప్రచారం చేయడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఫిర్యాదులో కాంగ్రెస్ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి వికా‌స్‌రావును కాంగ్రెస్ బృందం కలిసింది. కాంగ్రెస్ కంప్లైంట్‌ నేపథ్యంలో కేటీఆర్‌పై చర్యలకు తీసుకునేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news