ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో చిరంజీవి, మహేష్ బాబు….?

-

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం. హనుమాన్ . సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం రూ.75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.ఈ మూవీ సక్సెస్ పై ప్రేక్షకులే కాకుండా ప్రముఖులు ఎంతో మెచ్చుకున్నారు.

ఇదిలా ఉంటే…’హనుమాన్’ చిత్రంతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ‘జై హనుమాన్ లో హనుమంతుడి పాత్రలో చిరంజీవిని చూసే అవకాశం ఉంది. ఆయణ్ని కలిసి మాట్లాడాలి. రాముడి పాత్ర మహేశ్ బాబు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఆయన సెట్ అవుతారు. కానీ చూడాలి ఏం జరుగుతుందో. రాముడిలా ఆయన ఎలా ఉంటారో గ్రాఫిక్స్ కూడా చేసి చూసుకున్నాం’ అని వర్మ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news