ఫోర్బ్స్ జాబితాలో తెలుగు తేజం

-

టాప్ 10లో పీవీ సింధు

తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధిక మొత్తంలో సంపాదిస్తోన్న క్రీడాకారిణీల జాబితాను ఫోర్బ్స్ తాజాగా ప్రకటించింది. భారత్ నుంచి టాప్ – 10లో  అంటే ఏడో స్థానంలో నిలిచిన ఏకైక క్రీడాకారిణీ సింధు కావడం విశేషం. టెన్నిస్ క్రీడాకారిణులు కాకుండా ఇతర క్రీడకు చెందిన వారు కేవలం ఇద్దరు మాత్రమే ఉండగా వారిలో సింధు ఉండటం గమనార్హం.

వరసగా మూడో సారి  సెరెనా విలియమ్స్

అమెరికా అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో ఆమె ఈ స్థానాన్ని సాధించడం వరుసగా మూడోసారి. టోర్నీలు ఆడటం ద్వారా తీసుకునే ప్రైజ్ మనీతో పాటు వాణిజ్య ఒప్పందాల ద్వారా వచ్చే మొత్తాన్ని పరిగణలోకి తీసుకుని ఫోర్బ్స్ జాబితాను రూపొందించింది.

స్థానం క్రీడాకారిణి పేరు క్రీడ పేరు అందుకుంటున్న మొత్తం అమెరికా డాలర్లలో
1. సెరినా విలియమ్స్ టెన్నిస్ 18.1 మిలియన్లు

 

2. కరోలిన వొజ్నొకి టెన్నిస్ 13 మిలియన్లు

 

3. స్లోనే స్టీఫెన్స్ టెన్నిస్ 11.2 మిలియన్లు

 

4. గార్బిన్ ముగురుజ టెన్నిస్ 11 మిలియన్లు

 

5. మరియా షరపోవా టెన్నిస్ 10.5 మిలియన్లు

 

6 వీనస్ విలియర్స్ టెన్నిస్ 10.2 మిలియన్లు

 

7. పీవీ సింధు
బ్యాడ్మింటన్ 8.5 మిలియన్లు

 

8. సిమోనా హలెవ్ టెన్నిస్ 7.7 మిలియన్లు

 

9. డానిక పాట్రిక్ రేస్ కార్ డ్రైవర్ 7.5 మిలియన్లు

 

10. కెర్బర్ టెన్నిస్ 7 మిలియన్లు

 

 

Read more RELATED
Recommended to you

Latest news