సైరా టీజర్ పై పవన్ రియాక్షన్

-

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా సైరా నరసిం హారెడ్డి టీజర్ నిన్న రిలీజ్ అయ్యి సంచలనంగా మారింది. యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న ఈ సినిమా టీజర్ పట్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలా స్పందించి ఉంటాడన్న విషయం తెలుసుకోవాలన్న ఎక్సైట్మెంట్ అందరికి ఉంటుంది. ఆ విషయాన్ని అభిమానులకు ఊరిస్తూ చెప్పాడు మెగా పవర్ స్టార్ రాం చరణ్.

 

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఫ్యాన్స్ మీటింగ్ లో భాగంగా అభిమానులను ఉత్సాహ పరచేలా మాట్లాడిన రాం చరణ్ చివర్లో సైరా టీజర్ ను బాబాయ్ పవన్ కళ్యాన్ కు చూపించామని ఆయన టీజర్ అదిరిపోయింది.. సినిమా కోసం ఎదురుచూస్తున్నట్టు అన్నాడట. మొత్తానికి సైరాపై పవన్ రెస్పాన్స్ మెగా ఫ్యాన్స్ కు మరింత బలాన్ని ఇచ్చింది.

సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది బాషల్లో రిలీజ్ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news