మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ చిత్రంలో శ్రీలీల,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందించాడు.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా తన ఘాటుని కొనసాగిస్తూనే ఉంది.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తన మాస్ స్వాగ్ చూపిస్తూనే, మదర్ సెంటిమెంట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకుంది. దీంతో బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లని రాబట్టింది. ఫస్ట్ డే 94 కోట్ల గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యేసరికి 164 కోట్ల గ్రాస్ రాబట్టింది.ఇక వారం రోజుల్లో రెండువందల కోట్ల మార్క్ ని క్రాస్ చేసేసిన ఈ చిత్రం … తాజాగా 10 రోజులు పూర్తి చేసుకునేప్పటికీ 231 కోట్ల గ్రాస్ ని రాబట్టింది.కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 130 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా సుమారు 270 కోట్ల గ్రాస్ ని రాబట్టాలి. బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ని సాధించాలంటే ఈ సినిమా మరో 39 కోట్ల గ్రాస్ ని అందుకోవాల్సి ఉంది. మరి ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ను అందుకుంటుందో లేదో చూడాలి మరి.
బాక్సాఫీస్ వద్ద ‘గుంటూరు కారం’ పది రోజుల వసూళ్లు ఎంతంటే..!
By Ganesh
-
Previous article