బిగ్ బాస్ 7:శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ లలో ఒకరే టైటిల్ విజేత !

-

మా టీవిలో ప్రతిరోజూ రాత్రి ప్రసారం అవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 లో భాగంగా 10వవారం ఫామిలీ వీక్ కావడం వలన ఇల్లు అంతా ఫుల్ ఎమోషనల్ గా ఉంది. బిగ్ బాస్ ను గొడవల కోసం చూసేవాళ్ళు ఈ వారం స్కిప్ చేస్తారని చెప్పవచ్చు. ఇక బిగ్ బాస్ ఫైనల్స్ కు దగ్గర పడుతున్న వేళ ఎవరు విజేతగా నిలవనున్నారని సోషల్ మీడియాలో పోలింగ్స్ జరుగుతున్నాయి. ఇక ఇంట్లో ప్రవర్తన, ఆట మరియు మిగిలిన ఇంటి సభ్యులతో మింగిల్ అయ్యే విధానాలను అన్నీ పరిగణలోకి తీసుకుని చూస్తే, ఈ సారి విజేత అయ్యే వారిలో శివాజీ, పల్లవి ప్రశాంత్ మరియు అమర్ దీప్ లలో ఒకరు కావొచ్చని తెలుస్తోంది. ప్రతివారం కూడా వీరికి ఎలిమినేషన్ కావడానికి నామినేషన్ లో ఉన్నా రికార్డ్ స్థాయిలో ఓటింగ్ వస్తుండడమే దీనికి కారణమని అందరూ చెప్పుకుంటున్నారు.

ఇక అంబటి అర్జున్ కూడా టైటిల్ కోసం పోటీ పడుతున్నా కొన్ని విషయాలలో వీరికన్నా వెనుకబడి ఉన్నాడని అనుకుంటున్నారు ప్రేక్షకులు.

Read more RELATED
Recommended to you

Latest news