బెంగుళూరులో ఏపీ టెకీపై అత్యాచారం..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన ఓ సాఫ్ట‌వేర్ ఉద్యోగినిపై బెంగుళూరులో అత్యాచారం జ‌రింగింది. రెండ్రోజుల క్రితం పోలీసుల‌కు అత్యాచారం జ‌రిగిన‌ట్టు ఫిర్యాదు అందింది. ఈ కేసులో బాణ‌స‌వాడి పోలీసులు ఇద్ద‌రు నేజీరియ‌న్ల‌ను అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం పోలీసుల‌కు ఫిర్యాదు అంద‌గా అబుజి ఉబాకా, టోనీల‌ను పోలీసులు నింధితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. అంతే కాకుండా వీరి అరెస్ట్ కు సంబంధించి నైజీరీయా రాయ‌బార కార్యాల‌యానికి కూడా పోలీసులు ఇప్ప‌టికే స‌మాచారం అందించారు.

ప్ర‌స్తుతం బాధితురాలిని వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఓ ఆస్ప‌త్రికి త‌రలించిన‌ట్టు తెలుస్తోంది. ఓ వైపు రాష్ట్రంలో వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌లు…మ‌హిళ‌ల‌పై దారుణాలు క‌ల‌కలం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు బెంగుళూరులో ఏపీకి చెందిన టెకీపై అత్యాచారం ఆందోళ‌న క‌లిగిస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ కేసు విష‌యంలో క‌ల‌గ‌జేసుకుని బాధితురాలికి అండ‌గా నిల‌బ‌డాల‌ని బాధితురాలి బంధువులు కోరుకుటున్నారు.