మరో వైలెంట్ సినిమాతో వస్తున్న సందీప్ రెడ్డి వంగ…..

-

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకొని దర్శకుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ రెడ్డి. ఈ సినిమాలలో జస్ట్ శాంపిల్ చూపించిన వంగ ఇటీవల రిలీజ్ అయినటువంటి యానిమల్ మూవీతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. రణబీర్ కపూర్ లోని నటనను మొత్తం బయటికి తీసి తండ్రి మరియు కొడుకు పాత్రల ఎమోషన్ కి కమర్షియల్ టచ్ ఇచ్చాడు. డిసెంబర్ ఒకటో తేదీన రిలీజ్ అయిన ఈ సినిమాని ఈ రేంజ్ లో హిట్ అవుతుందని ఎవరు ఊహించి ఉండరు. ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో మంచి వసూళ్లను రాబడుతు కొత్త రికార్డులు తిరగరాస్తుంది.

 

ఇదిలా ఉండగా…. సందీప్ రెడ్డి వంగ సినిమాల లైనప్ చూస్తే మెంటల్ ఎక్కి పోయేలా ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాను తీస్తున్నట్టు ఇదివరకే ప్రకటించాడు దీనితోపాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మరొక మూవీకి కమిట్ అయ్యాడు. వీటితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక ప్రాజెక్టు చేసే ఆలోచన ఉన్నట్టు సమాచారం.

ఇవన్నీ సినిమాలు చాలవి అన్నట్లు యానిమల్ మూవీకి యానిమల్ పార్క్ సినిమా చేసేలా ఉన్నాడు. అన్ని కుదిరితే ఈ సినిమానే మొదటిగా పట్టాలెక్కించ బోతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుపై అంచనాలు చూస్తే వెయ్యికోట్లకి పైగా వసూళ్లు రాబడుతుందని అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news