ప్రెసోథెరపీ చేయించుకున్న బాలీవుడ్ బ్యూటీ….

-

బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌటెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ హీరోయిన్గా కంటే ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ లలో నటించింది. ఈ భామ టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ఇటీవల నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ఈ పాట సక్సెస్ కావడంతో ఆమెకి వరుసగా స్పెషల్ సాంగ్ ఆఫర్స్ వస్తున్నాయి. ఊర్వశి టాలీవుడ్ లో చివరగా రామ్ పోతినేని నటించిన స్కంద మూవీలో” కల్ట్ మామ” అనే సాంగ్ లో మెరిసింది.

ఇదిలా ఉంటే… రీసెంట్ గా ఈ భామ ప్రెసో థెరపీ చేయించుకుంది. గుండె సక్రమంగా పనిచేస్తుందో లేదో అని డాక్టర్లు ఈసీజీ పరీక్ష చేస్తారు. ఈ పరీక్షలో వైద్యులు ఏ విధంగా అయితే వైర్లు శరీరానికి అతికించి…. మానిటర్ కి కనెక్ట్ చేస్తారు.అలాంటి పరీక్ష ఈ భామ ఇటీవల చేయించుకుంది. కాకపోతే ఇది గుండెకి సంబంధించిన పరీక్ష కాదు. కానీ ఇదో రకమైన థెరపీ అని తెలుస్తుంది. ఈ థెరపీ శరీరంలోని శొషరసవ్యవస్థను ప్రేరేపించి ఆ తర్వాత టాక్సిన్స్ మొదలైన వాటిని బయటకు పంపించేస్తుంది. దీనిని ప్రేసో థెరపీ అంటారు.అయితే ఈ థెరపీ రోగ నిరోధక శక్తిని పటిష్టం చేయడానికి చేస్తారు. అలాగే ఈ భామ థెరపీ చేసుకుంటున్నటువంటి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news