టీమ్ఇండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ లు,కింగ్ విరాట్ కోహ్లీ దాదాపు 14 నెలల విరామం తరువాత ఇంటర్నేషనల్ టీ20ల్లోకి అడుగుపెట్టారు. 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ లో కోహ్లీ, రోహిత్ చివరి సారి టీ20 మ్యాచ్ ఆడారు. అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచుల టీ20సిరీస్‌కు కోహ్లీ,రోహిత్ లను సెలక్టర్లు ఎంపిక చేశారు. దీంతో ఈ సంవత్సరం జూన్‌లో వెస్టిండీస్-అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్ కప్ 2024లోనూ వీరు ఇద్దరు ఆడే అవకాశాలు ఉన్నాయి.
గాయాల కారణంగా హార్దిక్ పాండ్య,సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ దూరం కాగా సౌత్ ఆఫ్రికా పర్యటనలో రాణించిన పేసర్లు సిరాజ్,బుమ్రా లకు విశ్రాంతి ఇచ్చారు. ఇషాన్ కిషన్ విరామం ఇవ్వగా సంజు శాంసన్‌తో పాటు జితేశ్ శర్మకు అవకాశం కల్పించారు.
అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్, రింకూ సింగ్,తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్),కుల్దీప్ యాదవ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్,అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్,అర్ష్‌దీప్ సింగ్.