రాజకీయం అంటే గబ్బర్ సింగ్ సినిమా కాదు…చింతమనేని

Join Our Community
follow manalokam on social media

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తనదైన శైలిలో నిప్పులు చెరిగారు.  బుధవారం ప్రజాపోరాట యాత్రలో భాగంగా దెందులూరు ఎమ్మెల్యేపై పవన్ చేసిన ఆరోపణలకు గాను గురువారం చింతమనేని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ…  రాజకీయ  అంటే గబ్బర్ సింగ్ సినిమాలో డైలాగులు చెప్పినట్లు కాదు.. నువ్వు చేసిన ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల్లో నుంచి గౌరవంగా తప్పుకుంటా.. రాష్ట్రా స్థాయి నాయకుడైన నువ్వు ..నన్ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉంది అంటూ పవన్ని ఉద్దేశించి మాట్లాడారు.

నేను వ్యక్తిగతంగా విమర్శించడం ప్రారంభిస్తే మూడు రోజుల పాటు నువ్వు అన్నం మానేస్తావు అంటూ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూనే ఉంటా… ప్రజల కోసం వారి హక్కుల కోసం నేను పోరాడతా.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివి మీ స్థాయిని తగ్గించుకోవద్దంటూ హితవు పలికారు. త్వరలో రానున్న ఎన్నికల్లో నన్ను ఓడించడానికి  మీకు దమ్ముంటే నాపై పోటి చేస్తే బాగుంటుందని ఆయన అన్నారు. చింతమనేని – పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో పశ్చిమగోదావరి జిల్లా లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...