కొత్త కథలు, సరికొత్త కథనాలతో వచ్చే సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ అభిమానిస్తూనే ఉంటారు. ఆదరిస్తూనే ఉంటారు. కొత్త కథలతో వచ్చే సినిమాలు ఎన్నో సూపర్ హిట్ అయ్యాయి. సినిమా జానర్ ఎదైనా కావోచ్చు… నటీనటులు ఎవరైనా కావొచ్చు… బడ్జెట్ ఎంత అని ముఖ్యం కాదు.. కంటెంట్ ఎలా ఉన్నది అన్నదే ముఖ్యం.
అందుకోసమే కొత్త జానర్ వచ్చే సినిమాలకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. తనీష్ హీరోగా చేస్తున్న మరోప్రస్థానం సినిమా ఈ కోవలోకే వస్తుంది. ఎప్పుడూ తెలుగు సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని కొత్త కథతో తనీష్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సింగిల్ షాట్ సింగిల్ టేక్‌తో ఎలాంటి జర్క్‌లు లేకుండా కట్స్ లేకుండా సినిమాను చిత్రీకరించారు. పర్ఫెక్ట్‌గా చెప్పాలి అంటే రియల్ టైమ్‌లో రీల్ టైమ్ టేకింగ్.
అంటే రియల్ టైమ్‌లో సినిమా షూటింగ్ ఎప్పుడు ఎండ్ అవుతుందో రీల్ టైమ్‌లో సినిమా కూడా అప్పుడే ఎండ్ అవుతుంది. సినిమా మొత్తం స్ట్రైట్ స్క్రీన్‌ప్లేతో రన్ అవుతుంది. జానీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హిమాలయ స్టూడియో మాన్షన్, మిర్త్ మీడియా సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నది. ఈ నెలాఖరుకు సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పక్కాగా సినిమా మంచి విజయం సాధిస్తుందని దర్శక నిర్మాతలతో పాటు బయ్యర్లుకూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.