రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

Join Our Community
follow manalokam on social media

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటిపై గురువారం తెల్లవారు జూము నుంచి  ఐటీ శాఖ  అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తం 15 చోట్ల ఈ దాడులను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల వేళ ఐటీ దాడుల నేపథ్యంలో రాష్ట్రంలోని విపక్ష పార్టీల నేతలు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. హైదరాబాద్, కొడంగల్ ప్రాంతాల్లో రేవంత్ రెడ్డికి చెందిన ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులైన రేవంత్‌రెడ్డి ఈరోజు కొడంగల్‌ నుంచి రాష్ట్రవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఈరోజు ఉదయం 9-10 గంటల మధ్య ప్రచారం ప్రారంభానికి ఆయన అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో ఐటీ దాడులు జరగడం కలకలం రేపింది.

రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడుకి చెందిన ఇన్ ఫ్రాస్టక్చర్ కంపెనీలపై ఐటీ సోదాలు కొనసాగిస్తుంది. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా  రెండు గ్రూపులుగా ఏర్పడి ఐటీ శాఖ అధికారులు వచ్చారు.  ఈ దాడులపై ఆయన ఇంకా స్పందించలేదు.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...