గ్రూప్ 2 సర్వీసెస్ రిక్రూట్మెంట్ పై హైకోర్టు తుది తీర్పు ఇవ్వడంతో రిక్రూట్ మెంట్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఇటీవల సమావేశమైన కమిషన్ హైకోర్టు తీర్పుకు లోబడి గ్రూప్ 2 రిక్రూట్మెంట్ను పూర్తి చేయాలని నిర్ణయణం తీసుకుంది. తీర్పు ప్రకారం ఫైనల్ కీని రూపొందిస్తున్నామని కమిషన్ తెలిపింది. టిఎస్పిఎస్సి నాలుగు పేపర్లలోని 600 ప్రశ్నల్లో తొలుత 17 తీసివేయగా తర్వాత మరో 2 ప్రశ్నలను కూడా తొలగించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో తొలగించిన ప్రశ్నలకు సమాధానం (రైట్, రాంగ్) పెట్టిన అభ్యర్థులకు మాత్రమే మార్కులు కలపాలని హైకోర్టు పేర్కొంది. ఫైనల్ కీని 28న వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని కమిషన్ తెలిపింది.