హైదరాబాద్ : జీడిమెట్లలో వ్యభిచార ముఠా గుట్టురట్టు..!

హైదరాబాద్ జీడిమెట్ల లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయింది. సంజయ్… సాయి కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు జీడిమెట్లలో ఒక గదిని అద్దెకు తీసుకొని ఆర్థికంగా వెనుకబడిన మహిళలను తీసుకొచ్చి వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు పక్కా సమాచారం అందడంతో వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు మహిళలను, సాయి కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. సాయికుమార్ ను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు.

ఇక జీడిమెట్లలో లో అసాంఘిక కార్యకలాపాలు జరగడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకోకుండా చూడాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల హైదరాబాద్ లోని కూకట్ పల్లి లో కూడా ఇలానే జరిగింది. కూకట్ పల్లి లో ఇతర రాష్ట్రాల కు చెందిన యువతులను తీసుకువచ్చి వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న వ్యక్తులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కటకటాల్లోకి పంపించారు.