పుస్తకాలను చదవటం అలవాటు చేసుకుంటే జీవనప్రమాణాలు పెరుగుతాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోనితెలంగాణ కళాభారతి ఎన్టీఆర్‌స్టేడియంలో కపిలవాయి లింగమూర్తి ప్రాంగణం లోని సంగంలక్ష్మీబాయి వేదికగా 32వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను ఉపరాష్ట్రపత్తి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ”అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక”అన్న కాళోజీ మాటల్ని గుర్తు చేశారు. స్వతహాగాతెలుగు భాషాభిమాని, రచయిత అయిన కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం, భాషాభిమానులకు మంచి పరిణామమన్నారు.
ఊరుకో గ్రంథాలయం…ఇంటికోస్వచ్ఛాలయం ఉండేలా చూసుకోవాలని ప్రజలకుపిలుపునిచ్చారు. నేషనల్ బుక్ ట్రస్ట్ 1966లో ముంబైలో తొలి ప్రదర్శన నిర్వహించారని, నాటి నుంచి పుస్తక మహోత్సవా లకు మంచి ఆధరణ లభిస్తున్నదని అన్నారు. అక్షరంఅంటే నాశనం లేనిదని అర్థమ న్నారు. ఓ సందర్భంలో డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారుఅక్షరం గురించి చెబుతూ… అది అక్షరం. అదే చిగురిస్తే శబ్దమౌతుంది. అక్షరమనే తీగసాగితే వాక్యమవుతుంది. పందిరంత విస్తరిస్తే గ్రంథమౌతుంది అన్న మాటలనుగుర్తుచేశారు. తెలుగు తొలి ప్రచురణ ‘నూరు జ్ఞాన వచనాలు’ జర్మన్ దేశంలో హాతి గ్రామంలో బెంజిమిమ్ షుల్ట్ అనే క్రైస్తవ మతాధికారిప్రచురించారని తెలిపారు. పుస్తకాలు ఓ మతానికో, ఓ కులానికో, ఓ వర్గానికో పరిమితం కావన్నారు. ఈ పుస్తక మహౌత్సవాలు భాష, భావాల అభివృద్ధికి, సమాజాభివృద్ధికి, చైతన్యానికి దోహదం చేస్తాయని వివరించారు.