ఏపీపైపడగ విప్పిన పెథాయ్…

-

వరుసతుఫానులతో వణికిపోతున్న ఏపీపై పెథాయ్ రూపంలో మరో తుఫాను పడగ విప్పనుంది.బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్‌ తుఫాను ఆంధ్రప్రదేశ్‌ తీరంవైపు అతివేగంగా దూసుకొస్తోంది.నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉన్న తీవ్ర వాయుగుండం శనివారం తుఫానుగా రూపాంతరంచెందినట్టు వాతావరణశాఖ వెల్లడించింది. ఆదివారం సాయంత్రానికి మరింత బలపడి తీవ్రతుఫానుగా మారుతున్నట్లు వివరించింది. తుఫాను ప్రభావం ఉభయ గోదావరి, విశాఖపట్నం, కృష్ణ, గుంటూరు జిల్లాలపై ఉంటుందని అధికారులు హెచ్చరికలుజారీ చేశారు.

ఐఎండీ శనివారం అర్ధరాత్రి విడుదల చేసిన వివరాల ప్రకారం.. ప్రస్తుతంగంటకు 13 కిలోమీటర్ల వేగంతోప్రయాణిస్తోన్న పెథాయ్, శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో ట్రికోమలీ (శ్రీలంక)కి 460 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 530 కి.మీ, మచిలీపట్నానికి 690 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది. ఆదివారం తీవ్రతుఫానుగా బలపడి సోమవారం కూడా అదే తీవ్రతతో కొనసాగి మధ్యాహ్నం ఉత్తరవాయవ్య దిశగాప్రయాణించి మచిలీపట్నం- కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వివరించారు.  తుఫాను ప్రభావం కోస్తాలోని 5 జిల్లాలపై ఉంటుందని వెల్లడించారు. సోమవారాల్లోకోస్తాంధ్రలో చాలాచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖతెలిపింది. పెథాయ్ ప్రభావిత ప్రాంతాలపై ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news